మండలంలోని గుంజరాడ గిరిజన గ్రా మానికి చెందిన వంద కుటుంబాలు శనివారం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
Nov 10 2013 3:31 AM | Updated on Jul 25 2018 4:09 PM
కురుపాం, న్యూస్‌లైన్ : మండలంలోని గుంజరాడ గిరిజన గ్రా మానికి చెందిన వంద కుటుంబాలు శనివారం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నా యకుడు పత్తిక లక్ష్మయ్య మాట్లాడుతూ పేదల అభ్యున్నతే త మ పార్టీ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయూలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మక గోపాల్, బోటు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement


