'చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు' | YSR Congress party leader Balineni Srinivasa Reddy takes on Chandra babu naidu and Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు'

Mar 13 2014 11:26 AM | Updated on Jul 29 2019 5:31 PM

'చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు' - Sakshi

'చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు'

బీజేపీతో తెలుగుదేశం పార్టీ రహస్య పొత్తుపై స్థానిక ఎమ్మెల్యే , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు.

బీజేపీతో తెలుగుదేశం పార్టీ రహస్య పొత్తుపై స్థానిక ఎమ్మెల్యే , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. గురువారం బాలినేని ఒంగోలులో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన బీజేపీతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలనుకోవడం సీమాంధ్ర ప్రజలను అవమానపరచడమేనని ఆయన అభివర్ణించారు. గతంలో బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమని చంద్రబాబు వెల్లడించారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.

 

అలాంటి పార్టీలో మళ్లీ చంద్రబాబు అంటకాగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓ సిద్ధాంతం అంటూ లేని పచ్చి అబద్దాలకోరుగా పేర్కొన్నారు. బాబు కుటిలనీతిని సీమాంధ్ర ప్రజలు తిప్పికొడతారన్ని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ద్రోహి అని అన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ పార్టీ పెట్టిన ఆయన ప్రజల్లోకి వచ్చే నైతిక హక్కు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement