‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’ | YS Sharmila Speech In Kuwait Over YSRCP Cadre | Sakshi
Sakshi News home page

‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’

Sep 15 2019 6:04 PM | Updated on Sep 15 2019 7:52 PM

YS Sharmila Speech In Kuwait Over YSRCP Cadre - Sakshi

కువైట్‌ సిటీ: వైఎస్‌ షర్మిల కువైట్‌ పర్యటనలో భాగంగా జోసెఫ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జీవము గల దేవుడు’ 8వ వార్షికోత్సవ కార్యక‍్రమానికి ఆదివారం తన భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌తో కలిసి హాజర​య్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కువైట్ కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. జగనన్నను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చూడాలని పార్టీ అభ్యర్థుల విజయంలో వారు భాగస్వామలు అయినందుకు తమ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కువైట్‌లో ఉంటూ.. వారు చేసే సామాజిక సేవ అభినందనీయమని ఆమె కొనియాడారు.

దీంతో పాటు గల్ఫ్ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం వారు పనిచేస్తున్న తీరును, కువైట్‌​ కమిటీ చేసే సామాజిక సేవల గురించి షర్మిల.. ఇలియాస్‌, బాలిరెడ్డిలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్‌, బి.హెచ్. ముమ్మడి బాలిరెడ్డి, ఇతర వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ సభ్యులు, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement