'డాక్టర్ వైఎస్కు ప్రాణాలు పోయడమే తెలుసు'

'డాక్టర్ వైఎస్కు ప్రాణాలు పోయడమే తెలుసు' - Sakshi


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ అని.. ఆయనకు ప్రాణాలు పోయడమే తెలుసు గానీ, ప్రాణాలు తీయడం తెలియదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికార పార్టీ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పదే పదే ఆరోపణలు చేయడంతో ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు రెండు రాష్ట్రాల్లోను ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను కాపాడాయని, ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.గొట్టిముక్కల గ్రామం జాతీయరహదారికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అక్కడ తమ పార్టీ తరఫున చురుగ్గా వ్యవహరిస్తున్న డిప్యూటీ సర్పంచిని తెలుగుదేశం పార్టీకి చెందినవారు దారుణంగా హతమార్చినట్లు అక్కడివారు చెబుతున్నారన్నారు. అక్కడకు తాము వెళ్లినప్పటికి కూడా ఇంకా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని, అందుకు కారణం మంత్రి ఒత్తిడేనని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారని కొడాలి నాని అన్నారు. ఇలా అధికార పార్టీ ప్రోద్బలంతోనే అరాచకాలన్నీ జరుగుతున్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top