నారాయణరెడ్డిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌ | YS Jaganmohan Reddy Visitation to B.Narayana Reddy | Sakshi
Sakshi News home page

నారాయణరెడ్డిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

Apr 21 2017 2:04 AM | Updated on May 29 2018 4:37 PM

నారాయణరెడ్డిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌ - Sakshi

నారాయణరెడ్డిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డిని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించారు.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డిని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ నెల 13న ఆస్పత్రిలో చేరారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, రాజకీయ సలహా దారులు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరు లతో కలిసి వైఎస్‌ జగన్‌ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో నారాయణరెడ్డి బయటకు వస్తారని జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే ఉన్న వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement