ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ | ys jaganmohan reddy lands in idupulapaaya | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్‌ జగన్‌

Jul 7 2017 6:50 PM | Updated on Jul 7 2018 3:00 PM

ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ - Sakshi

ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్‌ జగన్‌

మహానేత వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయ చేరుకున్నారు.

వైఎస్‌ఆర్‌ కడప: మహానేత వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. స్థానికంగా ఉన్న నాయకులూ, కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలికారు.

వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఓ వికలాంగూడు ప్రేమతో తీసుకువచ్చిన కేక్‌ను జగన్ కట్ చేసారు. రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్ద నివాళులు ఆర్పించనున్నారు. అనంతరం ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఘాట్ వద్ద కార్యక్రమాలు పూర్తి కాగానే ఆయన హెలికాఫ్టర్‌లో గుంటూరులో జరగనున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీకి బయలుదేరుతారు.

Advertisement
 
Advertisement
Advertisement