
సాక్షి, అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీకి సంబంధించిన విషయంపై అందులో ప్రస్థావించారు. బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని కోరారు. పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని విజ్ఞప్తి చేశారు.