ప్రజలకు అండగా నిలవండి  | YS Jagan Review With Srikakulam Party Leaders on the loss of Fani Cyclone | Sakshi
Sakshi News home page

ప్రజలకు అండగా నిలవండి 

May 4 2019 2:56 AM | Updated on May 4 2019 8:53 AM

YS Jagan Review With Srikakulam Party Leaders on the loss of Fani Cyclone - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లాను ప్రభావితం చేసిన ఫొని తుపాను పరిస్థితిపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణితో పాటు పలువురితో తుపానువల్ల ఏ మేరకు నష్టం జరిగిందన్న విషయంపై ఆరా తీశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలని జగన్‌ వారిని కోరారు. ఆయన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement