వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం | ys jagan mohanreddy reaches gannavaram airport | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం

Dec 1 2016 10:57 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం - Sakshi

వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం

వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గురువారం ఉదయం విమానాశ్రయంలో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

వైఎస్ జగన్‌ ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం (బందరు) పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల పొలాలను లాక్కుంటున్న ప్రాంతాలను సందర్శిస్తారు. బందరు మండలంలోని బుద్దాలవారి పాలెం, కోన గ్రామాలలో ఆయన పర్యటిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్‌ జగన్‌ రోడ్డుమార్గంలో మచిలీపట్నం బైపాస్ మీదుగా బుద్దాలవారి పాలెం చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడుతారు. అనంతరం  అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement