ముస్లింలపై చం‍ద్రబాబు కపట ప్రేమ : వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Speech In Muslim Minority Meeting - Sakshi

విశాఖలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం

సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల సమయంలో చం‍ద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక హామీలిచ్చి వాటన్నింటినీ తుంగలో తొక్కారని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ  సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోని రాగనే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కార్పొరేషన్లు పూర్తిగా అవినీతిమయంతో కూడి ఉన్నాయని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షళణ చేస్తామన్నారు. టీడీపీ పాలనలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని.. కేవలం ఎన్నికల సమయంలోనే ఆయనకు ముస్లింలు గుర్తుకు వస్తారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ఎన్నికల్లో భాగంగానే ఇటీవల గుంటూరులో ‘నారా హమారా.. ముస్లిం హమారా’ అనే కార్యక్రమం పెట్టారని మండిపడ్డారు. ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం ఎందుకు లేదని ప్రశ్నించిన ముస్లిం పిల్లలపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్‌ దుల్హన్‌ పథకం ద్వారా వివాహ సమయంలో ప్రతీ ఆడబిడ్డకు లక్ష రూపాయాలు సహాయం చేస్తాం. వైఎస్సార్‌ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని ఆదుకున్నారు. పేద ముస్లిం పిల్లలకు కేజీ టూ ఉచిత విద్యను అందించారు. 2014లో ఎన్నికల సమయంలో ముస్లింల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. కానీ నాలుగేళ్ల కాలంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు. 2017-18 బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమం కోసం 850 కోట్లు  కేటాయించారు. కానీ కేవలం 350 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా అనేక అబద్దాపు వాగ్దానాలు ఇచ్చారు. ముస్లింలకు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారా ముస్లింలకు రుణాలు మంజూరు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ నాలుగేళ్లయినా ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ విద్యార్ధులను అత్యంత ఘోరంగా మోసాం చేశారు. కాలేజీ ఫీజుల కడతామని హామీ ఇచ్చి తరువాత మోహం చాటేశారు. చం‍ద్రబాబు పాలనలో ముస్లిం బాలికలపై అత్యాచారాలు జరుతున్నా పట్టించుకోవడం లేదు. న్యాయం చేయండని పోరాడిన వాళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారు’’ అని జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

12-09-2018
Sep 12, 2018, 08:45 IST
బుధవారం ఉదయం వైఎస్‌ జగన్‌ విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు
12-09-2018
Sep 12, 2018, 07:11 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో నెల రోజులుగా అప్రతిహతంగా సాగుతోంది. గ్రామీణ విశాఖలో జరిగిన ఏడు బహిరంగ సభలు...
12-09-2018
Sep 12, 2018, 07:07 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజ కవర్గ పరిధిలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో చినగదిలి వద్ద బుధవారం మధ్యాహ్నం...
12-09-2018
Sep 12, 2018, 07:02 IST
సాక్షి, విశాఖపట్నం: జననేత రాకతో వాల్తేరు హోరెత్తిపోయింది. సాగర తీరానికి ఎగసిపడే అలలతో పోటీగా జననేత అడుగులో అడుగు వేసేందుకు...
12-09-2018
Sep 12, 2018, 06:59 IST
విశాఖపట్నం :సీపీఎస్‌ రద్దుకు సహకరించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ ప్రతినిధులు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఆయనకు...
12-09-2018
Sep 12, 2018, 06:57 IST
అల్లిపురం(విశాఖ దక్షిణం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని...
12-09-2018
Sep 12, 2018, 06:55 IST
విశాఖపట్నం :‘అడుగడుగునా దగాపడుతున్నాం. పింఛన్‌కు దరఖాస్తు చేస్తే అర్హత లేదంటారు. రేషన్‌ కార్డు కావాలంటే సాధికారిత సర్వేలో సవరణ చేసుకురమ్మంటారు....
12-09-2018
Sep 12, 2018, 06:53 IST
విశాఖపట్నం : మాది విశాఖపట్నంలో చినవాల్తేరు. ప్రజాసంకల్పయాత్రలో మా బాబు వియాన్‌ను జగనన్న ఎత్తుకొని ముద్దాడారు. మాకు చాలా ఆనందంగా...
12-09-2018
Sep 12, 2018, 06:50 IST
విశాఖపట్నం : మాది శివాజీపాలెం. 16వ వార్డు. 2016లో మాకు వివాహమైంది. అప్పటి నుంచి రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేస్తున్నాం....
12-09-2018
Sep 12, 2018, 03:23 IST
చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బుల కన్నా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అంతకు మించి వంద రెట్ల ప్రయోజనం ఉంటుందని జనం...
12-09-2018
Sep 12, 2018, 02:03 IST
11–09–2018, మంగళవారం బీచ్‌ రోడ్‌లోని కామత్‌ హోటల్‌ సమీపం,విశాఖ జిల్లా  ఎన్నికల యుద్ధానికి నా సహచరులను కార్యోన్ముఖులను చేశాను  ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని...
11-09-2018
Sep 11, 2018, 20:37 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 261వ...
11-09-2018
Sep 11, 2018, 09:04 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌...
11-09-2018
Sep 11, 2018, 08:15 IST
స్వాతంత్య్రానంతరం ఆర్థిక, రాజకీయ సాధికారతకు నోచుకోని బ్రాహ్మణులకు జనహృదయ నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మీయ హస్తం అందించారు. ఆదుకుంటామని అభయమిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో...
11-09-2018
Sep 11, 2018, 08:08 IST
సాక్షి, విశాఖపట్నం: మాది పేద బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నగారు కేటరింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు ఎంసెట్‌లో...
11-09-2018
Sep 11, 2018, 08:07 IST
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఓ మహిళ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి.
11-09-2018
Sep 11, 2018, 08:04 IST
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విశాఖలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించడం గొప్ప విషయం. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా...
11-09-2018
Sep 11, 2018, 07:58 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 260వ రోజు...
11-09-2018
Sep 11, 2018, 07:50 IST
విశాఖపట్నం :ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పార్టీలు, కులమతాలకు అతీతంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తానని ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన...
11-09-2018
Sep 11, 2018, 07:48 IST
సాక్షి, విశాఖపట్నం: వేదాధ్యయనం చేసిన పెదవులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక స్థితి సహకరించకపోయినా అగ్రవర్ణానికి...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top