రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy participated in rottela panduga | Sakshi
Sakshi News home page

రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్

Oct 14 2016 2:52 PM | Updated on Oct 20 2018 6:19 PM

రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్ - Sakshi

రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రొట్టెల పండుగలో పాల్గొన్నారు.

నెల్లూరు: ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. బారాషహీద్‌ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో రోట్టెలు పట్టారు.

ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుని రోడ్డు మార్గంలో నెల్లూరు వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్ కు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.  రొట్టెల పండుగలో పాల్గొన్న తర్వాత తిరుపతికి వైఎస్ జగన్ పయనమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement