వైఎస్సార్‌ ‘లా’ నేస్తం ప్రారంభించిన సీఎం జగన్‌

YS Jagan Launches YSR Law Nestham Scheme - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకాన్ని ప్రారంభించారు. నేడు జాతీయ న్యాయవాదులు దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అలాగే వైఎస్సార్‌ లా నేస్తం వెబ్‌సైట్‌ను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ లాంచ్‌ చేశారు. ఈ పథకం కింద కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లకు వృత్తిలో స్థిరపడేవరకు మూడేళ్లపాటు నెలకు రూ. 5వేల సాయం అందజేయనున్నారు. 2016, ఆ తర్వాత లా పరీక్ష ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు ఈ పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top