రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | young man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Oct 26 2015 4:52 PM | Updated on Aug 30 2018 3:56 PM

గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండకు చెందిన యువకుడు మృతి చెందాడు.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం మండాదిగోడు గ్రామ శివారులో సోమవారం జరిగింది.

మాచెర్ల వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న అటవీ శాఖ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  టాటా ఏస్ వాహనం పైన కూర్చొని ఉన్న యువకుడు మృతిచెందాడు. మృతుడు నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లికి చెందిన గాలి శ్రీహరి(22)గా గుర్తిచారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement