మహిళపై అత్యాచారం అనంతరం హత్య! | Woman raped and murdered in karimnagar district | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారం అనంతరం హత్య!

Oct 25 2013 9:49 AM | Updated on Jul 28 2018 8:51 PM

కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి మండలం మారుతీనగర్లో హత్యకు గురైన మహిళపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు శుక్రవారం అనుమానం వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి మండలం మారుతీనగర్లో హత్యకు గురైన మహిళపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు శుక్రవారం అనుమానం వ్యక్తం చేశారు. మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చేస్తున్నారు.

 

పోస్ట్మార్టం నివేదిక అందితేకానీ తాము ఏమి చేప్పలేమన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ మహిళకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసుల స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అయితే మారుతీనగర్లో మహిళ మృతదేహన్ని గుర్తుంచిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement