అమ్మవారి సాక్షిగా హత్య | woman murdered in a temple | Sakshi
Sakshi News home page

అమ్మవారి సాక్షిగా హత్య

Mar 23 2015 7:22 PM | Updated on Jul 30 2018 8:29 PM

అమ్మవారి సాక్షిగా హత్య - Sakshi

అమ్మవారి సాక్షిగా హత్య

పవిత్ర దేవాలయంలో సాక్షాత్తూ అమ్మవారి సాక్షిగా ఒక మహిళను దారుణంగా రాయితో బాది హత్య చేసిన ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.

ప్రొద్దుటూరు : పవిత్ర దేవాలయంలో సాక్షాత్తూ అమ్మవారి సాక్షిగా ఒక మహిళను దారుణంగా రాయితో బాది హత్య చేసిన ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ పెన్నానది ఒడ్డున ఉన్న చౌడేశ్వరీదేవి ఆలయానికి పూజల నిమిత్తం వస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అమ్మవారి పాదాల చెంత బండరాయితో బాది హత్య చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఈ హత్య వెనుక ఆలయ వాచ్‌మెన్ నర్సింహులు హస్తముందేమోనన్న అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement