మదనపల్లె రూరల్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది.
మదనపల్లె రూరల్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. దీంతో బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సోమవారం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ములకలచెరువు మండలం చెరువుకిందపల్లెకు చెం దిన ఎం.నరసింహులు భార్య కల్పన(19)కు ఆరునెలల క్రితం రెండో కాన్పు లో బాబు పుట్టాడు.
బి.కొత్తకోటలో సోమవారం జరిగిన కుటుంబ నియం త్రణ ఆపరేషన్‌కు తీసుకెళ్లారు. డాక్టర్ ఆమెతో పాటు మరో 15 మందికి కు.ని ఆపరేషన్లు నిర్వహించారు. అయితే కల్పన పొత్తికడుపు నుంచి రక్తస్రావం అధికం కావడంతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. 108 ద్వారా మదనపల్లెకు వచ్చిన కల్పనను వైద్యులు బతికించడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చివరకు కల్పన మృతి చెందింది.
విషయం తెలుసుకున్న మృతురాలి భర్త నరసింహులు, సీపీఐ, బాస్ నాయకులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాస్తారోకో నిర్వహించా రు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తూ, బాధ్యులైన డాక్టర్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టూ టౌన్ సీఐ హనుమంతునాయక్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.