108లో హలో సిస్టర్స్‌

Woman Give Baby Twins Birth In 108 Vehicle Chittoor - Sakshi

గంగవరం : గంగవరం మండలం గండ్రాజుపల్లె వద్ద 108 వాహనంలో ఒక గర్భిణి కవల పిల్లలకు జన్మనిచ్చింది. పెద్ద ఉగిని గ్రామానికి చెందిన అబూజార్‌ భార్య ఆల్మాస్‌ నిండుగర్భిణి. శుక్రవారం నొప్పులు ప్రారం భం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం వచ్చింది. ఆ వాహ నంలో పలమనేరు ప్రభుత్వాస్పత్రికి  తరలి çస్తున్నారు. మార్గమధ్యంలో గండ్రాజుపల్లె వద్ద ఆమె కవలను(ఆడపిల్లలను) ప్రసవించింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని, పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది కిషోర్, శివ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top