రైలు ఢీ కొని గుర్తుతెలియని మహిళ మృతి | Woman dies in train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీ కొని గుర్తుతెలియని మహిళ మృతి

May 29 2015 8:23 PM | Updated on Sep 4 2018 5:16 PM

రైలు ఢీకొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని మహిళ దుర్మరణం చెందింది.

హైదరాబాద్ :  రైలు ఢీకొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటన హైదరాబాద్ నాంపల్లి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 40 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తు తెలియని మహిళ శుక్రవారం బేగంపేట్ రైల్వే స్టేషన్ బ్రిడ్జి సమీపంలో పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతురాలు ఎరుపు రంగు జాకెట్, వంకాయ రంగు చీర ధరించినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా ఆమె మెడ ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉందని తెలిపారు. స్థానికులు అందించిన ఫిర్యాదుతో సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు తెలిపారు. సంబంధీకులెవరైనా ఉంటే నాంపల్లి జీఆర్పీ పోలీసులను లేదా 040-23202238 ఫోన్ నంబరును సంప్రదించవచ్చును.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement