వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మహిళ మృతి చెందింది.
విజయనగరం: వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జరిగింది. వివరాలు..కురుపాం మండలం జోగిరాజుపేట గ్రామానికి చెందిన కొత్తర గంగమ్మ(45) ఆటోలో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి పడింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(కురుపాం)