భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య | Wife commites suicide after husband torture | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

Jun 14 2015 9:59 AM | Updated on Sep 3 2017 3:45 AM

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. నీటిపారుదల శాఖలో పనిచేసే బాలు అనే ఉద్యోగి గత ఏడాది కాలంగా భార్య దివ్యను వేధిస్తున్నాడు. గత ఏడాది నుంచి ఆమెను కనీసం పుట్టింటికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో భర్త వేధింపులను భరించలేకపోయిన ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక ఏడాది పాప ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement