
ఆమెకు ఏ అర్హత లేదని ఫించన్ ఆపేసారు?
ఆంధ్రప్రదేశ్ లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫించన్లపై టీడీపీ సర్కారు అన్యాయంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దూబగుంట రోశమ్మ ఏపీకే ఆదర్శమని, ఏ అర్హత లేదని ఆమె ఫించన్ ఆపేసారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇందుకు దివాన్చెరువు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక వార్డులో మాత్రమే నెగ్గింది. గ్రామంలోని 16 వార్డులలో 12 వార్డులలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు గెలుపొందారు.