
'రుణమాఫీ ఎందుకు వాయిదా వేస్తున్నారు'
వ్యవసాయ రుణమాఫీని ఎందుకు వాయిదా వేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీని ఎందుకు వాయిదా వేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 5 నెలల పాలనలో ఒక్కరూపాయైనా రైతుకు రుణం ఇప్పించారా అని నిలదీశారు. పంటల బీమా కట్టకుండా అన్నదాత గొంతు కోశారని ధ్వజమెత్తారు.
రైతులకు రుణం ఇప్పించకపోతే విత్తనాలు, ఎరువులు ఎలి కొంటారని ప్రశ్నించారు. రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలో మిగిలిన విద్యుత్ ను రాష్ట్ర మిగులు విద్యుత్ కింద జమకట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు.