వాట్ ఐ యామ్ 'నాట్' సేయింగ్..

వాట్ ఐ యామ్ 'నాట్' సేయింగ్..


* మీరడిగింది కాదు... నే చెప్పిందే వినాలన్నట్లుగా వ్యవహరిస్తున్న బాబు

* తప్పించుకునే ప్రయత్నంలో మీడియాకు అడ్డంగా దొరికిపోతున్న వైనం


 

సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయిన నారావారు... తప్పించుకునే దారిలేక.., చేసిన తప్పును ఒప్పుకోలేక.. అసలు విషయాన్ని పక్కకునెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను, ప్రభుత్వ సంస్థలనేకాదు మీడియాను కూడా తప్పుదోవపట్టించేలా తన చాణక్యతను ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందా? టేపులో గొంతు తనదా? కాదా? అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా ట్యాపింగ్, ఫిరాయింపులంటూ కొత్త పల్లవి అందుకున్నారు.  ఇండియా టుడే ఇంటర్వ్యూలో కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు విచిత్ర సమాధానాలు చూద్దాం.

 

- ఇలా కొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలిస్తూ దాటవేసేందుకు ప్రయత్నించిన బాబు

- మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.

 

రాజ్‌దీప్: స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని, అదే స్టీఫెన్ సన్‌తో.. కమిట్‌మెంట్లు అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తామని మీరు చెప్పారని టీఆర్‌ఎస్ అంటోంది. దీనిపై మీరేమంటారు?

 బాబు: అధికారం లేకున్నా వాళ్లు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ పనులన్నీ ఎలక్షన్ కమిషన్ చేయాలి. (స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది నిజమేనా?)

 రాజ్‌దీప్:  వాళ్లు స్టింగ్ ఆపరేషన్ చేసింది మీ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే కదా?

 బాబు: నేనేమంటానంటే.. ప్రతీ ప్రభుత్వం ఎమ్మెల్యేలపై ఇలా చేసుకుంటూ పోతే

 ఎలక్షన్ కమిషన్ ఏమవుతుంది? ఎలక్షన్ కమిషన్ ఉన్నదెందుకు?(చేసిన తప్పు

 గురించి మాట్లాడకుండా...)

 రాజ్‌దీప్: మీ ఎమ్మెల్యే 50 లక్షలు ఎందుకు తీసుకెళ్లారు?

 బాబు: అది వేరే విషయం(దాటవేసేందుకు ప్రయత్నిస్తూ..) విచారణ జరగాలి(అంటూనే..)అందులోకి నన్ను లాగవద్దు.

 రాజ్‌దీప్:  ఏసీబీ మీకు సమన్లు జారీ చేస్తుందని కేసీఆర్ సంకేతాలిస్తున్నారు కదా..

 బాబు: ఆయన(కేసీఆర్) ఏమీ చే యలేడు..

 రాజ్‌దీప్: అంటే మీకు సమన్లు పంపలేడా?

 బాబు: ముందు సమన్లు పంపమనండి.. అపుడు నేనేం చేయాలో అది చేస్తాను.

 రాజ్‌దీప్: మీకు సమన్లు జారీ చేసేందుకు అవసరమైన అనుమతి కోసం ఆయన గవర్నర్ వద్దకు వెళ్లారు కదా?

 బాబు: మాకేం అధికారాలున్నాయో.. మా దగ్గర ఏం ఆధారాలున్నాయో మేం చూపిస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top