సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే.. నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘‘లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితాన్ని.. కుటుంబాల కష్టార్జితాన్ని ఉద్యోగ పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నారు. వారికి కావాల్సింది ఒక్కటే.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా.. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. వ్యవస్థే విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు కాదు.. మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకం.
చంద్రబాబూ.. న్యాయం చేయడం మీకు ఒక ఆప్షన్ కాదు.. ప్రభుత్వపరంగా మీ బాధ్యత. కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?.వారి భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? డీఎస్సీలో బయటపడిన స్కాంకు మీరు బాధ్యత వహిస్తారా? లేదా? నిరుద్యోగుల కలలతో ఆడుకోవడం కాదు..వారి కష్టానికి న్యాయం చేయండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!
Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters… pic.twitter.com/hyYMHwsYEK— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026


