వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమ రాజ్యం  | Welfare State With YSRCP Possible In Andhra Pradesh State | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమ రాజ్యం 

Mar 14 2019 4:02 PM | Updated on Mar 14 2019 4:09 PM

Welfare State With YSRCP Possible In Andhra Pradesh State - Sakshi

31వ వార్డులో నవరత్నాల గురించి వివరిస్తున్న కాపు భారతి, పార్టీ శ్రేణులు

సాక్షి, రాయదుర్గంటౌన్‌: సంక్షేమ రాజ్యం కోసం వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, కుమార్తె స్రవంతి ఓటర్లకు కోరారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని 31వ వార్డులో ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు.

14 నెలల పాటు పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను జగన్‌ ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. ప్రతి పేదవాడి కష్టం తీర్చాలని, అక్క చెల్లమ్మల బాధలు తొలగించాలని, అన్న, తమ్ముళ్లుకు తోడుగా ఉండాలనే మహా సంకల్పంతో ప్రతి కుటుంబాన్నీ ఆదుకునేందుకు నవరత్నాల్లాంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

అధికారం కోసం చంద్రబాబు ప్రజలను అడుగడుగునా మోసాలు, కుట్రలు చేస్తూ చివరకు వ్యక్తిగత సమాచారాలను సైతం దొంగిలించారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మహిళలను మోసం చేశాడన్నారు. ఇంటికో ఉద్యోగం అని యువతను మోసం చేశారన్నారు. రైతులు, కార్మికులు, ప్రతి వర్గాన్నీ మోసం చేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌సీపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు తాడూరు గోపి, సత్యనారాయణ, గోవిందరాజులు, ముస్తాక్, పలువురి రాము, భీమనపల్లి దివాకర్, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.  

బన్నీ మహంకాళి ఆలయంలో పూజలు 
ప్రచారానికి ముందు పట్టణంలోని 31వ వార్డులోని బన్నీ మహంకాళి ఆలయంలో కాపు భారతి, పార్టీ నాయకులు పూజలు చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు చెక్‌పెట్టి రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement