‘స్పీకర్‌ కోడెల క్షమాపణలు చెప్పాలి’ | we will fight behalf st president kumari: roja | Sakshi
Sakshi News home page

‘స్పీకర్‌ కోడెల క్షమాపణలు చెప్పాలి’

Mar 22 2017 6:56 PM | Updated on Oct 29 2018 8:10 PM

‘స్పీకర్‌ కోడెల క్షమాపణలు చెప్పాలి’ - Sakshi

‘స్పీకర్‌ కోడెల క్షమాపణలు చెప్పాలి’

గోళ్లపాడు సర్పంచ్‌ కుమారి విషయంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘన జరిగిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు.

గూంటూరు: గోళ్లపాడు సర్పంచ్‌ కుమారి విషయంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘన జరిగిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ విషయంపై స్పీకర్‌ కోడెల క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సర్పంచ్‌ కుమారి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆమె హెచ్చరించారు.

ప్రశ్నించే ప్రజాప్రతినిధులను నిర్బంధించడం హేయం అని ఆమె అన్నారు. రాష్ట్రంలో అటవిక పాలన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత సభ జరిగిన చోటే ఎస్టీ సర్పంచ్‌ను అవమానించారని అన్నారు. మరో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అధికార పార్టీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కూడా తమ గొంతునొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement