సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తాం: అంబటి | we will fight back aggressively for united state, says ambati rambabu | Sakshi
Sakshi News home page

సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తాం: అంబటి

Sep 20 2013 8:21 PM | Updated on Sep 4 2018 5:07 PM

సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తాం: అంబటి - Sakshi

సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తాం: అంబటి

సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

హైదరాబాద్: సమైక్యరాష్ట్రం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం ముగిసిన అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అన్ని అంశాలను సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై పోలీసుల వ్యవరిస్తున్న తీరును అంబటి తప్పుబట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా, సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోనూ సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలుపుతున్న వారున్నారన్నారు.

 

మరో ప్రజాప్రస్థానం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిలను అభినందిస్తూ తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్లు అంబటి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement