రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం: పొన్నం ప్రభాకర్ | we never agree to rayala telangana, says ponnam prabhakar | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం: పొన్నం ప్రభాకర్

Dec 2 2013 8:39 PM | Updated on Sep 2 2017 1:11 AM

రాయల తెలంగాణకు తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు

ఢిల్లీ: రాయల తెలంగాణకు తమ ప్రాంత ప్రజాప్రతినిధులు వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకుండా రాయల తెలంగాణను ఏర్పాటు చేయడం తగదని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే అంగీకరిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఇష్టం లేకుండా రాయలసీమను విభజన చేయొద్దన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వరం పెంచారు. ఇప్పటికే 10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణకే మాత్రమే అంగీకరిస్తామని బీజేపీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement