'ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో కలవం' | we don't work with Congress, says kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో కలవం'

Mar 17 2014 11:14 AM | Updated on Jul 29 2019 5:31 PM

'ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో కలవం' - Sakshi

'ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్తో కలవం'

ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో కలవమని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

విశాఖ : ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో కలవమని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం విశాఖలో సమైక్యాంధ్ర జేఏసీ సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  తాను పదవి కోసం పార్టీ పెట్టలేదని ... తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే పార్టీ పెట్టామన్నారు.

రాష్ట్ర విభజన బిల్లు అక్రమమని పార్లమెంట్లో పలు పార్టీలు ఆందోళన చేశాయని కిరణ్ అన్నారు. బిల్లు అక్రమమని రాజ్యసభలో బీజేపీ చెప్పిందని ఈ సందర్బంగా కిరణ్ గుర్తు చేశారు. 371 డి వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురు అవుతాయని కిరణ్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement