హైదరాబాద్ తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఓకే: టీ కాంగ్రెస్ నేతలు | We accept Hyderabad as temporary common capital, say t-congress leaders | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఓకే: టీ కాంగ్రెస్ నేతలు

Nov 6 2013 9:17 PM | Updated on Sep 2 2017 12:20 AM

హైదరాబాద్ను తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా చేయడానికి తమకు అభ్యంతరం లేదు గానీ, శాశ్వతంగా మాత్రం ఉమ్మడి రాజధాని చేయొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని కోరారు.

హైదరాబాద్ను తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా చేయడానికి తమకు అభ్యంతరం లేదు గానీ, శాశ్వతంగా మాత్రం ఉమ్మడి రాజధాని చేయొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని కోరారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి వారు ఈ మేరకు ఒక నివేదిక సమర్పించారు. హైదరాబాద్కు ఢిల్లీ తరహా పాలన వద్దని కూడా కోరారు.

వారు నివేదికలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి...
తెలంగాణ సీఎం నేతృత్వంలో పీపుల్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఏర్పాటు చేయాలి
కమిటీలో తెలంగాణ, ఆంధ్ర డీజీపీలు సభ్యులుగా ఉండాలి
పోలవరాని కంటే ముందు గోదావరిపై 10 డ్యాంలు కట్టేందుకు అనుమతి ఇవ్వాలి
ప్రాణహిత - చేవెళ్ల, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌కు జాతీయ హోదా కల్పించాలి
తెలంగాణ రాష్ట్రంలోనూ 371(డి) అధికరణాన్ని కొనసాగించాలి
సర్వీసు రిజిస్టర్‌ ప్రకారమే ఉద్యోగుల, పింఛన్ల స్థానికత గుర్తించాలి
విద్యుత్‌ ఉత్పత్తికి మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌లో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలి
శంకర్‌పల్లి విద్యుత్‌ కేంద్రానికి గ్యాస్‌ పంపిణీ చేయాలి
ప్రాజెక్టులపై ఒక మానిటరింగ్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
మహబూబ్‌నగర్‌కు వైద్య కళాశాలను కేటాయించాలి
తెలంగాణలో వైద్య విశ్వవిద్యాలయం ఒకదాన్ని ఏర్పాటు చేయాలి
వరంగల్‌కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

Advertisement
 
Advertisement
Advertisement