'బొత్స సవాల్ను స్వీకరిస్తున్నాం' | we accept botsa satya narayanas challenge, says kalva srinivasulu | Sakshi
Sakshi News home page

'బొత్స సవాల్ను స్వీకరిస్తున్నాం'

Jun 19 2015 4:15 PM | Updated on Jul 12 2019 3:10 PM

'బొత్స సవాల్ను స్వీకరిస్తున్నాం' - Sakshi

'బొత్స సవాల్ను స్వీకరిస్తున్నాం'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చేసిన సవాల్ను తాము స్వీకరిస్తున్నామని టీడీపీ నాయకుడు, ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చేసిన సవాల్ను తాము స్వీకరిస్తున్నామని టీడీపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం కాల్వ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అంతకుముందు యనమల రామకృష్ణుడు వేసిన ప్రశ్నలకు కౌంటర్గా వైఎస్ఆర్ సీపీ.. చంద్రబాబుకు, టీడీపీకి 23 ప్రశ్నలు సంధించింది. ఇవి వాస్తవమో కాదో చెప్పాలని బొత్స సవాల్ విసిరారు.

ఆవేదనతో తమ పార్టీ నాయకులు కొందరు గవర్నర్ నరసింహన్పై వ్యాఖ్యలు చేశారని, వాటిని వెనక్కు తీసుకుంటున్నామని కాల్వ చెప్పారు. తాము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement