గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం | wall collapsed, two more workers killed | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం

May 3 2015 10:39 PM | Updated on Sep 3 2017 1:21 AM

చిత్తూరు జిల్లాలో గోడ కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో గోడ కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం, వేల్కూరు గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. వేల్కూరు పంచాయతీ పీబీ అగ్రహారానికి చెందిన ఎత్తురాజులు ఇంటి తలుపుల తయారీ కోసం సీమచింత చెట్టు కోసేందుకు అదే గ్రామానికి చెందిన నటేశన్(50), పెరుమాళ్ (52)ను వెంట బెట్టుకుని వెళ్లాడు.

 

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం ముగ్గురు కలసి సమీపంలోని పాత కోళ్ల షెడ్ వద్ద సేదతీరారు. వర్షానికి బాగా తడిసి ఉన్న గోడ వారిమీద కుప్పకూలింది. గోడ శిధిలాల కిందపడి నటేశన్, పెరుమాళ్ అక్కడికక్కడే మరణించారు. ఎత్తురాజులు తీవ్రంగా గాయపడగా అతన్ని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement