స్థానికులే చేతులు కట్టేశారు

Visakha City Police Commissioner Rajiv Kumar Meena comments on Sudhakar Issue - Sakshi

డాక్టర్‌ సుధాకర్‌ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించారు

విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా వెల్లడి  

సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తూ సస్పెండైన డాక్టర్‌ సుధాకర్‌ శనివారం సాయంత్రం మద్యం సేవించి స్థానికులు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులే చేతులు కట్టేశారని అడిషనల్‌ డీజీపీ, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. డాక్టర్‌ సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డాక్టర్‌ను లాఠీతో కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశామని చెప్పారు.
 
వైద్యుల పరిశీలనలో సుధాకర్‌
డాక్టర్‌ సుధాకర్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధారాణి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయన ‘ఎక్యూట్‌ హ్యాండ్‌ యాడ్‌ కామెంట్‌ సైకోసిస్‌’ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఇదిలావుండగా, డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిభాయి ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడిపై అన్యాయంగా పిచ్చివాడిగా ముద్ర వేశారని ఆరోపించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top