పీహెచ్‌సీకి తాళం వేసిన గ్రామస్తులు | Villagers have been locked to PHC center | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీకి తాళం వేసిన గ్రామస్తులు

Nov 14 2013 3:40 AM | Updated on Sep 2 2017 12:34 AM

నెల రోజులుగా వైద్యులు విధులకు రావడం లేదని ఆరోపిస్తూ భాంజీపేట సర్పంచ్ భూక్య లలిత ఆధ్వర్యంలో గ్రామస్తులు పీహెచ్‌సీకి బుధవారం తాళం వేశారు.

నర్సంపేట, న్యూస్‌లైన్ :  నెల రోజులుగా వైద్యులు విధులకు రావడం లేదని ఆరోపిస్తూ భాంజీపేట సర్పంచ్ భూక్య లలిత ఆధ్వర్యంలో గ్రామస్తులు పీహెచ్‌సీకి బుధవారం తాళం వేశారు. అనంతరం పీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతోపాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీఓ అరుణకువూరితో వూట్లాడారు. వెంటనే ఆమె పీహెచ్‌సీని సందర్శించి, విచారణ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వూట్లాడుతూ పీహెచ్‌సీకి వైద్యులు, సిబ్బంది వస్తున్నారా లేదా అని విచారణ చేపట్టగా గైర్హారవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. పీహెచ్‌సీలోని స్టాక్ రిజిష్టర్, అటెండెన్స్ రిజిష్టర్‌ను సీజ్ చేసి, సిబ్బందిపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆమె వివరించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement