breaking news
narsam peta
-
జంపింగ్.. జపాంగ్..
న ర్సంపేట, న్యూస్‌లైన్ : మునిసిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కప్పదాట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను తమవైపు తిప్పుకుని ఆధిపత్యం చెలాయించేందుకు ముఖ్యనేతలు ఆరాటపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా పార్టీల ఫిరాయింపులు, ప్రచారాలతో నర్సంపేట రాజకీయం వేడెక్కింది. వివరాల్లోకి వెళితే.. నర్సంపేట నియోజకవర్గానికి రాజకీయపరంగా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దొంతి వూధవరెడ్డి, తెలంగాణ ప్రాంతంలోనే టీడీపీకి బలమైన నాయుకుడిగా చెలావుణి అవుతున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్‌జగా కొనసాగుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిలు ఆయా పార్టీలకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మూడు ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోవాలంటే ముందు గా పార్టీలో నాయకులు, కార్యకర్తలు అధికంగా ఉండాలనే ఉద్దేశంతో పోటాపోటీగా వారు ఎదుటిపార్టీలోని వారిని చేర్చుకుం టున్నారు. కాగా, ఇదే అదనుగా భావిస్తున్న జంప్ జిలానీలు.. తావుు పోటీ చేసేందుకు అనుకూలమైన స్థానాలను ముందుస్తుగా ఖరారు చేసుకుని పార్టీలు వూరుతున్నారు. మొత్తం మీద నాయకుల కప్పదాట్లతో నర్సంపేటలో సందడి నెలకొంది. -
పీహెచ్‌సీకి తాళం వేసిన గ్రామస్తులు
నర్సంపేట, న్యూస్‌లైన్ : నెల రోజులుగా వైద్యులు విధులకు రావడం లేదని ఆరోపిస్తూ భాంజీపేట సర్పంచ్ భూక్య లలిత ఆధ్వర్యంలో గ్రామస్తులు పీహెచ్‌సీకి బుధవారం తాళం వేశారు. అనంతరం పీహెచ్సీ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతోపాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీఓ అరుణకువూరితో వూట్లాడారు. వెంటనే ఆమె పీహెచ్‌సీని సందర్శించి, విచారణ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వూట్లాడుతూ పీహెచ్‌సీకి వైద్యులు, సిబ్బంది వస్తున్నారా లేదా అని విచారణ చేపట్టగా గైర్హారవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. పీహెచ్‌సీలోని స్టాక్ రిజిష్టర్, అటెండెన్స్ రిజిష్టర్‌ను సీజ్ చేసి, సిబ్బందిపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆమె వివరించారు.