ఏపీలో అందుబాటులోకి గ్రామ సచివాలయ వ్యవస్థ

Village Secretariats: AP CM YS Jagan Inaugurate Gram Secretariat in East Godavari - Sakshi

కరపలో గ్రామ సచివాలయాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

అంకిత భావంతో సేవలు అందించండి

సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఈ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలు ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావంతో సేవలు అందించాలని ఆయన ....ఉద్యోగులకు సూచిస్తూ ఆటోగ్రాఫ్‌ చేశారు. అనంతరం హైస్కూలు గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ స్ధలానికి చేరుకున్న సీఎం జగన్‌ ప్రభుత్వ పథకాల ఫోటో ఎగ్జిబిషన్‌ను  తిలకించారు. అలాగే సభా వేదికపై అంబేద్కర్‌, వైఎస్సార్‌ విగ్రహాలకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. కాగా   సచివాలయాల్లో పని చేయడానికి  ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1,34,918 లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top