కాంగ్రెస్లో చేరిన విజయరామారావు, రఘునందన్ | Vijayaramarao, Raghunandan&chandrasekhar joined in Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్లో చేరిన విజయరామారావు, రఘునందన్

Aug 20 2013 8:14 PM | Updated on Mar 18 2019 9:02 PM

విజయరామారావు-రఘునందన్-చంద్రశేఖర్ - Sakshi

విజయరామారావు-రఘునందన్-చంద్రశేఖర్

టిఆర్ఎస్కు రాజీనామా చేసిన గుండె విజయరామా రావు, ఎ.చంద్రశేఖర్, ఆ పార్టీ నుంచి సస్పెండయిన రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

న్యూఢిల్లీ: టిఆర్ఎస్కు రాజీనామా చేసిన  గుండె విజయరామారావు, ఎ.చంద్రశేఖర్, ఆ పార్టీ నుంచి సస్పెండయిన రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌  సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. దిగ్విజయ్ సింగ్‌ వారి భుజాలపై పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్కు రాజీనామ చేసిన రోజునే  చంద్రశేఖర్, విజయరామారావులు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ ముగ్గురితోపాటు మెదక్ ఎంపి విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి ఓ పక్క ఏఐసిసి అధ్యక్షురాలుతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఆమె వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్‌లను  కలిశారు. ఈ నేపధ్యంలో ముందుగా వీరు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement