రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు | vigilance attacks on | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు

Jan 9 2014 5:37 AM | Updated on Sep 2 2017 2:26 AM

మండల కేంద్రంలోని రెండు రైస్ మిల్లులపై బుధవారం విజిలెన్స్ అధికారులు దా డులు నిర్వహించారు. 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

 త్రిపురారం, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని రెండు రైస్ మిల్లులపై బుధవారం విజిలెన్స్ అధికారులు దా డులు నిర్వహించారు. 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. బాబుసాయిపేట రోడ్డు సమీపంలో ఉన్న శ్రీనివాస మోడరన్ రైస్ మిల్లుల్లో నర్సింహ అనే వ్యాపారి ప్రజల వద్ద కొనుగోలు చేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువ చేశాడు. అదే వి ధంగా వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్లులో వెంకటేశ్వ ర్లు అనే వ్యాపారి  85 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిలు వ ఉంచాడు.


 సమాచారం అందుకున్న  విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి బి య్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బియ్యా న్ని తుంగపాడులో ఉన్న వంశీసాయి రైస్ మిల్లులో అప్పగించారు. ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ స్వామి తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఓ శ్రీధర్‌రెడ్డి, కానిస్టేబుల్ విష్ణువర్దన్, గిరి, సివిల్ సప్లయ్ ఆర్‌ఐ వాజీద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement