మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి | venkaiah naidu pays tributes malli masthan babu | Sakshi
Sakshi News home page

మల్లి మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళి

Apr 25 2015 8:38 AM | Updated on Sep 3 2017 12:52 AM

పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు.

నెల్లూరు: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు భౌతికకాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.  మరోవైపు మల్లి మస్తాన్ బాబు అంతిమయాత్ర కొనసాగుతోంది. అధికార లాంఛనాలతో ప్రభుత్వం మస్తాన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement