ఎర్ర కూలీలు, అటవీ అధికారుల మధ‍్య ఛేజింగ్‌ | vehicle chasing between forest officers and red sandal workers in ysr district | Sakshi
Sakshi News home page

ఎర్ర కూలీలు, అటవీ అధికారుల మధ‍్య ఛేజింగ్‌

Jan 28 2017 12:10 PM | Updated on Oct 4 2018 6:03 PM

(ఫైల్ ఫొటో) - Sakshi

(ఫైల్ ఫొటో)

వైఎస్సార్‌ జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఖాజీపేట : వైఎస్సార్‌ జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖాజీపేట మండలంలో ఎర్రచందనం కూలీలకు, అటవీ అధికారులకు మధ‍్య ఛేజింగ్‌ జరిగింది.

అటవీశాఖ అధికారులకు అందిన ముందస‍్తు సమాచారంతో ఎర్రచందనం దుంగలతో వెళ్తున‍్న కారును గుర్తించారు. దానిని ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వేగంగా వెళ్లడంతో అధికారులు ఛేజింగ్‌ చేశారు. అయినా ఎర్రకూలీల కారును అధికారులు అందుకోలేకపోయారు. దురదృష‍్టవశాత్తూ కూలీల కారు అదుపు తప్పి రోడ్డు పక‍్కనున‍్న కాలువలో పడిపోవడంతో ఇద‍్దరు ఎర్రచందనం కూలీలు అటవీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటనలో ఓ స్కార‍్పియోను, టన‍్ను ఎర్ర చందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద‍్దరిని అరెస్టు చేసి స‍్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement