'రాష్ట్రాన్ని చంద్రబాబు సోమాలియాగా మారుస్తున్నారు' | Vasireddy Padma takes on Andhra Pradesh Chief Minister Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాన్ని చంద్రబాబు సోమాలియాగా మారుస్తున్నారు'

Jul 1 2014 5:15 PM | Updated on May 25 2018 9:17 PM

'రాష్ట్రాన్ని చంద్రబాబు సోమాలియాగా మారుస్తున్నారు' - Sakshi

'రాష్ట్రాన్ని చంద్రబాబు సోమాలియాగా మారుస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ సోమాలియాగా మారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ సోమాలియాగా మారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
 
మంగళవారం హైదరాబాద్లో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భాస్కరరెడ్డి మరణం పోలీసులతో టీడీపీ నేతలు చేయించిన రాజకీయ హత్య అని ఆమె అభివర్ణించారు.
 
ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి కానీ... రక్త చరిత్ర కాదని చంద్ర బాబుకు ఈ సందర్బంగా పద్మ హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ హత్య రాజకీయాలను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారని పద్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ తాజాగా అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తల దాడిలో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హత్యకు గురవ్వగా, 110 మందికి తీవ్ర గాయాలయ్యాయని, వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉందని శాసనసభ దృష్టికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన విషయాన్ని మీడియాకు గుర్తు చేశారు. టీడీపీ చేస్తున్న హత్యా రాజకీయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement