‘మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి ’ | Vasireddy Padma Comments On YSRCP Government In Krishna | Sakshi
Sakshi News home page

మహిళలకు సముచిత స్థానం కల్పించారు: వాసిరెడ్డి పద్మ

Sep 7 2019 1:55 PM | Updated on Sep 7 2019 2:07 PM

Vasireddy Padma Comments On YSRCP Government In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: జగ్గయ్యపేట పట్టణంలో ప్రభత్వవిప్ సామినేని ఉదయభానుతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు.  ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధాన్ని విధించి మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని గుర్తు చేశారు.

ఉదయభాను మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పరిపాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామినేని ప్రశాంత్ బాబు, తన్నీరు నాగేశ్వరావు, జాన్ వెస్లీ, వేల్పుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement