సమైక్య దీక్ష | united andhra initiation | Sakshi
Sakshi News home page

సమైక్య దీక్ష

Oct 4 2013 1:07 AM | Updated on May 25 2018 9:10 PM

సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది. పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు చేపట్టిన 48 గంటల నివధిక దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య దీక్ష
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది. పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు చేపట్టిన 48 గంటల నివధిక దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. దీక్షలోని నాయకులకు మద్దతు తెలియజేయడానికి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అదేవిధంగా ఏపీఎన్‌జీఓలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, వైద్యులు, రైతు సంఘం నాయకులు సంఘీబావం తెలియజేస్తున్నారు. ఆళ్లగడ్డలో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి మద్దతుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్ష కొనసాగింది. రుద్రవరంలో యువకులు రిలే నిరాహర దీక్ష చేపట్టారు. శిరివెళ్ల మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. నంద్యాలలో కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల దీక్ష కొనసాగుతోంది. మద్దతుదారులతో పాటు పట్టణ ప్రముఖులు,
 

Advertisement
 
Advertisement
Advertisement