యూకే ఎంపీనైనా.. భారత్ అల్లుడినే | UK MP Daniel Bales met chandrababu naidu | Sakshi
Sakshi News home page

యూకే ఎంపీనైనా.. భారత్ అల్లుడినే

Dec 6 2014 1:41 PM | Updated on Aug 18 2018 5:48 PM

యూకే ఎంపీనైనా.. భారత్ అల్లుడినే - Sakshi

యూకే ఎంపీనైనా.. భారత్ అల్లుడినే

ఆంధ్రప్రదేశ్ రాజధాని, స్మార్ట్ సిటీల నిర్మాణంలో యూకే సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు డేనియల్ బైల్స్ తెలిపారు.

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ రాజధాని, స్మార్ట్ సిటీల నిర్మాణంలో యూకే సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు డేనియల్ బైల్స్ తెలిపారు. ఆయన శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం డేనియల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.

తాను యూకే ఎంపీనైనా భారత్ అల్లుడినేని ఆయన తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి యూకే సిద్ధంగా ఉందని డేనియల్ పేర్కొన్నారు. కాగా డేనియల్ బైల్స్...వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ద్వారకాపేటకు చెందిన డాక్టర్ ప్రశాంతిరెడ్డిని 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement