ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు | Two SIs And A Constable Were Suspended In Krishna | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు

Sep 25 2019 3:28 PM | Updated on Sep 25 2019 4:33 PM

Two SIs And A Constable Were Suspended In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. ఈ మేరకు ఇద్దరు ఎస్‌ఐలు, ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. కైకలూరు పేకాట నిర్వాహకుల బృందంతో కొంతమంది పోలీసులు సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలడంతో కలిదిండి ఎస్సై సుధాకర్‌, కానిస్టేబుల్‌ రజనీకుమార్‌ను సస్పెండ్‌ చేశారు. మరోవైపు ఓ పార్టీ వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేసిన కేసులో పెనుగంచిప్రోలు ఎస్సై హశ్వక్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Advertisement
 
Advertisement
Advertisement