డివైడర్ను ఢీకొన్న ఆటో: ఇద్దరు మృతి | Two killed in road accident at Ghatkesar | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొన్న ఆటో: ఇద్దరు మృతి

Nov 30 2013 8:28 AM | Updated on Aug 30 2018 3:56 PM

రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఆటో డివైడర్ను ఢీ కొట్టింది.

రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఉదయం ఆటో డివైడర్ను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు.దాంతో 108 వాహనం సంఘటన స్థలానికి  చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అయితే ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం హైదరాబాద్ తరలించారు.  అతి వేగమే ఆ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement