టీటీడీ పాలక మండలి ఏర్పాటుకు జీవో విడుదల

TTD New Governing Council AP Government Issues Order - Sakshi

24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు

సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం దాని చట్టంలో సవరణలు చేసిన నేపథ్యంలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం గతంలోనే నియమించింది. తాజాగా నియమించిన సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, దేవాాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో పాలక మండలిలో ఎక్స్‌ అఫిషీయో సభ్యులుగా కొనసాగుతారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సమాజ సేవకులకు చోటు కల్పించింది. 

టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా..  
1. కే.పార్థసారథి (ఎమ్మెల్యే)
2. యూవీ రమణమూర్తిరాజు (ఎమ్మెల్యే)
3. ఎం.మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే)
4. పరిగెల మురళీకృష్ణ
5. కృష్ణమూర్తి వైద్యనాథన్‌
6. నారాయణస్వామి శ్రీనివాసన్‌
7. జే.రామేశ్వరరావు
8. వి. ప్రశాంతి
9. బి.పార్థసారథిరెడ్డి
10. డాక్టర్‌ నిచిత ముప్పవరకు

11 నాదెండ్ల సుబ్బారావు
12 డీ.పీ.అనంత
13 రాజేష్‌ శర్మ
14 రమేష్‌ శెట్టి
15 గుండవరం వెంకట భాస్కరరావు
16 మూరంశెట్టి రాములు
17 డి.దామోదర్‌రావు
18 చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌
19 ఎంఎస్‌ శివశంకరన్‌
20 సంపత్‌ రవి నారాయణ
21 సుధా నారాయణమూర్తి
22 కుమారగురు (ఎమ్మెల్యే)
23 పుత్తా ప్రతాప్‌రెడ్డి
24 కె.శివకుమార్‌

ఎక్స్‌ అఫీషియో సభ్యులు..
1 రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్‌)
2 దేవాదాయ శాఖ కమిషనర్‌
3 తుడా చైర్మన్‌
4 టీటీడీ ఈవో

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top