టీడీపీ అవకాశవాద రాజకీయాలకు కేంద్రం: కేటీఆర్ | TRS Mla k. Ramarao Fire on telugu desam party | Sakshi
Sakshi News home page

టీడీపీ అవకాశవాద రాజకీయాలకు కేంద్రం: కేటీఆర్

Aug 23 2013 1:38 PM | Updated on Aug 29 2018 1:16 PM

అవకాశవాదానికి, అనైతిక రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ కేంద్రంగా మారిందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు.

అవకాశవాదానికి, అనైతిక రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ కేంద్రంగా మారిందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగుదేశంపార్టీపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. తెలుగు జాతి కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారన్నా హరికృష్ణ వాదనకు అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో రాష్ట్రాన్ని విభజించాలని ఎన్టీఆర్ స్వయంగా కోరారని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తు చేశారు.

 

హరికృష్ణ చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును తెలుగుదేశం పార్టీలకి తీసుకోవద్దని గతంలోనే ఎన్టీఆర్కు చాలా మంది సూచించారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇంత జరుగుతున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు తప్ప మరే కమిటీలను అంగీకరించమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement