తుపాను తీవ్రంగా ఉంటే రైళ్లు రద్దు | Trains may be cancelled due to cyclone | Sakshi
Sakshi News home page

తుపాను తీవ్రంగా ఉంటే రైళ్లు రద్దు

Nov 28 2013 1:42 AM | Updated on Sep 2 2017 1:02 AM

లెహర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లిస్తామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ సాంబశివరావు బుధవారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్/విజయవాడ, న్యూస్‌లైన్: లెహర్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లిస్తామని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌ఓ సాంబశివరావు బుధవారం తెలిపారు.  వచ్చే రెండు రోజుల్లో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ ఈమేరకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే బుధవారం రాత్రి వరకు మళ్లింపులు, రద్దుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, తుపాను ప్రభావం మొదలయ్యాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ముందుజాగ్రత్తగా ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, లెహర్ తుపాను నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే బుధవారం మూడు రైళ్లను మళ్లించింది.
 హెల్ప్‌లైన్ కేంద్రాల ఫోన్ నంబర్లు: విజయవాడ: 0866-2575038, 2767075; నెల్లూరు: 0861-2345863, 2345864; ఏలూరు: 08812- 226401; రాజమండ్రి: 0883- 2420541, 2420780; అనకాపల్లి: 08924-221698; గూడూరు: 086 24-251827; ఒంగోలు: 08592-280202/03; తాడేపల్లిగూడెం: 08818-226162; తుని: 08854-252172; నిడదవోలు - 08813-210325 సామర్లకోట - 0884-252172.

Advertisement
 
Advertisement
Advertisement