విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని బొర్రా-చిమిడిపల్లి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
విశాఖ: విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని బొర్రా-చిమిడిపల్లి మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గురువారం మధ్యాహ్నం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలికి చేరుకుని మరమ్మతులు ప్రారంభించారు.